KMR: శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కామారెడ్డి రూరల్ సీఐ పల్లె శ్రీధర్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టి మాట్లాడారు. ప్రజల భద్రత శాంతి భద్రతలను కాపాడటం నా ప్రధాన బాధ్యతని మీ అందరి సహకారం సూచనలు కూడా ఎంతో అవసరమని తెలిపారు. ఏ సమస్య ఉన్న పోలీస్ శాఖను నిర్ణయంగా సంప్రదించాలని, నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.