NGKL: రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలో బుధవారం నుంచి చికెన్ షాపులను మూసివేశారు. పౌల్ట్రీ కంపెనీలు కమీషన్ మార్జిన్ తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని, లాభాలు లేక వ్యాపారాలు చేయలేని పరిస్థితి నెలకొందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గించిన మార్జిన్‌ను పునరుద్ధరించే వరకు నిరసన కొనసాగుతుందని తెలిపారు.