E.G: విజయవాడలో ఇటీవల జరిగిన ఒలింపియాడ్ కాంపిటేషన్ పోటీల్లో గోకవరానికి చెందిన లక్ష్మీశ్రీ పాల్గొని ప్రతిభ కనపరిచింది. ఆమె మొత్తం మూడు గోల్డ్ మెడల్ సాధించినట్లు గోకవరం సొసైటీ ఛైర్మన్ సత్తిబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారిని కుటుంబీకులు, గ్రామస్థులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.