TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6వ తేదీన నిర్మల్ జిల్లాలోని బాసరలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జ్ఞాన సరస్వతీ క్షేత్రానికి వెళ్లనున్న ఆయన.. అమ్మవారిని దర్శించుకోనున్నారు. అలాగే ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు నిన్న నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు.