SDPT: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ మౌలానా డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేట బస్సు డిపో ముందు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం బలవంతంగా అమలు చేస్తున్న చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయమని ప్రకటించాలని డిమాండ్ చేశారు.