BPT: బాపట్ల పట్టణంలో శ్రీ పేరం గరుడాచలం నాయుడు విగ్రహ ప్రతిష్ఠాపన బుధవారం జరిగింది. స్థానిక చిల్లు రోడ్డు సెంటర్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విగ్రహ ప్రతిష్ఠాపన పనులన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం సంబంధిత నిర్వాహకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.