TG: కేరళలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, పినరయి విజయన్‌కు తేడా ఏమీ లేదని అన్నారు. BJP ఓటు బ్యాంకును పినరయికి బదిలీ అయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు. కేరళ ప్రజలు తెలివైన వారు, విద్యావంతులు అని కొనియాడారు. కేరళ ప్రజలు మతతత్వ శక్తులను అనుమతించరన్నారు. మతతత్వ శక్తులు రాకుండా ఇక్కడి ప్రజలు లక్ష్మణ రేఖ గీశారని తెలిపారు.