లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌ను కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. షూటింగ్ సెట్లో తనతో అనుచితంగా ప్రవర్తించారని ఓ యువ నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలతో ఆయన తన అకాడమీ పదవికి రాజీనామా చేశారు. హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో బయటపడుతున్న వరుస వేధింపుల కేసుల్లో ఇది మరో సంచలనంగా మారింది.