VZM: గజపతినగరం మండలంలోని రామన్నపేట గ్రామంలో బుధవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఎన్నికల్లో వచ్చిన హామీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి పాల్గొన్నారు.