KMR: మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రతపై కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, యువతకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయని, బ్లాక్ స్పాట్ల వద్ద తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.