VZM: కొత్తవలస బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ఓరుగంటి మురళీకృష్ణ ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్.కోటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మురళీకృష్ణ ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన మురళీకృష్ణకు అభినందనలు తెలిపారు.