ATP: బెలుగుప్ప కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో మంగళవారం సైబర్ భద్రత, బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై శివ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు సోషల్ మీడియా వాడకంలో ఉండాల్సిన మెలకువలను వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు.