ADB: భీంపూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు. రైతు పెట్టుబడి సహాయం, పూర్తి స్థాయిలో రుణ మాఫీ, పంట భీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. రైతుల నుంచి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అంకం అశోక్, ప్రధాన కార్యదర్శి కొకటి వెంకటేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.