SRCL: గంభీరావుపేట మండల కేంద్రంలోని పురాతన సీతారామచంద్రస్వామి ఆలయం అరుదైన ఘనత సాధించింది. ఇక్కడి ఆలయంలో గత 700 ఏళ్లుగా నిరంతరాయంగా వెలుగుతున్న ‘నంద దీపం’ విశిష్టతను గుర్తించిన “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్” సంస్థ, ఇందులో చోటు కల్పించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధుల నుంచి రికార్డు సర్టిఫికేట్, మెమెంటోను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా అందుకున్నారు.