అన్నమయ్య: రవాణా శాఖ టెక్నికల్ అసోసియేషన్ డైరీని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. బోరెడ్డి గారిపల్లిలోని మంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జోనల్ సెక్రటరీలు, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు నూతన మార్పులకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి సూచించారు.