KMR: సాతేలి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి విగ్రహాన్ని గ్రామ వీధుల గుండా పల్లకీలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ రాధా నాగరాజ్ కూడా హాజరై భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తి వాతావరణంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.