W.G: రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమయం వేళల్లో మార్పు చేయాలని కోరుతూ గురువారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గొల్ల ప్రభాకర్‌కు ప్రభుత్వ అధ్యాపకుల సంఘం వినతిపత్రం అందజేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.5 గంటల వరకు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆలస్యంగా ఇంటికి చేరుతున్నారన్నారు. ఉ.9:30 నుంచి సా. 4గంటల వరకు టైమింగ్ మార్చాలన్నారు.