మహీంద్రా అండ్ మహీంద్రా SUVలు, వాణిజ్య వాహనాల ధరలను ఈనెల 6 నుంచి 2.5% వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. సంప్రదాయ ఇంధన ఇంజిన్ల (ఐసీఈ)తో నడిచే SUVలు, వాణిజ్య వాహనాల సగటు ధరలు 1.6% పెరుగుతాయని కంపెనీ ప్రకటనలో తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. XUV7 XO వాహనం ధర తొలి 40 వేల మంది కొనుగోలుదార్లకు మాత్రం పెరగదని వివరించింది.