NGKL: కొల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలను అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ సందర్శించారు. విద్యార్థుల హాజరు, పదవ తరగతి పరీక్షల రవాణా సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు.