TG: SIR విషయంలో కాంగ్రెస్ కావాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాల్సిందేనని స్పష్టం చేశారు. బాలాపూర్‌లోని రోహింగ్యాలు, చనిపోయిన, ట్రాన్సఫర్ అయిన వారి ఓట్లు తొలగించాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో ఒకే ఇంట్లో 1,00,200 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ప్రజలకు SIRపై ఆందోళన అవసరం లేదన్నారు.