పాత్రల్లో జీవించడమే కాదు, షూటింగ్ అయ్యాక వాటి నుంచి బయటకు రావడం కూడా నేర్చుకోవాలని అంటోంది హీరోయిన్ శ్రీలీల. కేవలం కంఫర్ట్జోన్లో ఉండకుండా, తనను తాను సవాలు చేసుకునే పాత్రలను ఎంచుకుంటానని స్పష్టం చేసింది. రాబోయే రెండేళ్లలో తన పని తీరే సమాధానం చెబుతుందని ధీమా వ్యక్తం చేసింది. శ్రీలీల ఇటు దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.