SRD: సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని ప్రజలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 30 లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయం, బిల్ కలెక్టర్లు లేదా అధికారిక వెబ్సైట్ (cdma.telangana.gov.in) ద్వారా నగదు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.