NGKL: అచ్చంపేట సాయినగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. MLA మాట్లాడుతూ.. రేషన్ బియ్యం ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో నూతన షాపుని ప్రారంభించామని తెలిపారు. తమ కాలనీలో నూతన రేషన్ షాప్ ప్రారంభం అవడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.