GDWL: మానవపాడు మండల కేంద్రంలో ఇండేన్ గ్యాస్ గోదాం వద్ద వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓటీపీ పేరుతో సిబ్బంది వేధిస్తున్నారని, గ్యాస్‌ను సక్రమంగా ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని మహిళలు ఇవాళ ఆరోపించారు. ఎండలో గంటల తరబడి వేచి ఉన్నా తాగునీటి సౌకర్యం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజులుగా తిరుగుతున్నామని బాధితులు తెలిపారు.