కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల సోమారం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ వైస్ ఛైర్మన్ జక్కుల రాజిరెడ్డి ప్రారంభించారు. సొసైటీ వైస్ ఛైర్మన్ మాట్లాడుతూ.. రైతులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, పండించిన వరి ధాన్యం దళారులకు విక్రయించవద్దని కోరారు. కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని అమ్మి లాభాలు పొందాలని సూచించారు.