KMM: ముందస్తు అడ్మిషన్లు చేపట్టే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ ఖమ్మం నగర అధ్యక్షుడు హరిచంద్ర ప్రసాద్ తెలిపారు. ఇంటర్ బోర్డు ముట్టడించిన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా సంవత్సరం పూర్తి కాక ముందే ముందస్తు అడ్మిషన్లు చేపడుతూ తల్లి, తండ్రులను మోసగిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు.