BHPL: చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను రైతులతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం IDOC కార్యాలయంలో రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ సభల్లో రైతుల అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి పరిష్కారం చేయాలని ఆదేశించారు.