NZB: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16వ తేదీన జరిగే మండల స్థాయి సభలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఈమేరకు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 2న నిర్వహించిన గ్రామ సభలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు