NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అడవి ప్రాంతంలో కొనసాగుతున్న సలేశ్వరం లింగమయ్య జాతరను మరో రెండు రోజుల పాటు పొడిగించాలని భక్తులు కోరుతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ పెరిగింది. దర్శనానికి గంటల తరబడి దట్టమైన అటవీ ప్రాంతంలో వేచి ఉండాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.