MDK: హవేలి ఘనపూర్ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. లోక రక్షణ కోసం యేసుక్రీస్తు సిలువపై చేసిన త్యాగాన్ని స్మరిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాస్టర్ జేమ్స్ రవీందర్ భక్తులకు వాక్యోపదేశం చేస్తూ.. సిలువపై యేసయ్య పలికిన ఏడు మాటల విశిష్టతను వివరించారు.