KDP: సీఎం చంద్రబాబు కలలో తప్ప ఇలలో కనిపించని అమరావతిని లక్ష ఎకరాల్లో నిర్మిస్తానని చెప్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడుతూ.. లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు అవసరమన్నారు. అంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలన్నారు. బాబు చెప్పే రాజధాని ఆచరణ సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు.