కోనసీమ: పి.గన్నవరం నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ పవిత్రమైన రోజున యేసు క్రీస్తు మన కోసం చేసిన అపారమైన త్యాగాన్ని స్మరించుకుందాం. ఆయన ప్రేమ, క్షమ, దయ మన జీవితాలకు మార్గదర్శకంగా ఉండాలి’ అని ఆయన అన్నారు.