SDPT: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లును “హేట్ స్పీచ్ బిల్లు కాదు.. ఫ్రీజ్ స్పీచ్ బిల్లు” అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్‌ను హరించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేవి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులని తెలిపారు.