RR: చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో దొడ్డి కొమురయ్య జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రేరణగా నిలిచిన మహానుభావుడని, ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమన్నారు.