ASF: తిర్యాణి మండలం రోంపల్లి PHC లో ల్యాబ్ టెక్నీషియన్ లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రక్త పరీక్షల కోసం గర్భిణులు, సామాన్య రోగులను తిర్యాణి ఆసుపత్రికి పంపిస్తుండటంతో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో పరీక్షలు కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు స్పందించి ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించాలని అన్నారు.