GDWL: అయిజ మండలం మేడికొండ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ట్రాక్టర్‌పై స్వామివారి చిత్రపటాన్ని అలంకరించి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. గ్రామ పెద్ద లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని కోరారు. ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతత లభిస్తుందన్నారు.