వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య మంగళ వారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎర్ర అంజయ్య మాట్లాడుతూ.. ప్రతి పరీక్షా కేంద్రంలో నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.