AP: గత YCP ప్రభుత్వం అప్పులను వారసత్వంగా ఇచ్చిందని మంత్రి పార్థసారథి అన్నారు. అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందని తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. అప్పులను తీర్చడమే కాకుండా.. బకాయిలు కూడా చెల్లిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తు తరాలకు ఆదాయాన్ని సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.