SRCL: ప్రతి ప్రభుత్వ కార్యాలయం నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై తనిఖీ చేశారు.