NRML: నిర్మల్ పట్టణంలోని కస్బ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైయర్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యానికి శుద్ధమైన తాగునీరు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.