ATP: గుంతకల్ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మంగళవారం కూరగాయల మార్కెట్‌ను తనిఖీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని, చెత్తను మున్సిపల్ పాయింట్లలోనే వేసి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని వ్యాపారస్తులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఒక కిరాణా షాపునకు రూ. 500 జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు ప్రతాప్, సుదర్శన్, ఎస్సై రవి పాల్గొన్నారు.