NZB: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ మరణం తీరని లోటని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కంచెట్టి గంగాధర్ మంగళవారం ఉదయం మృతి చెందారు.