NLR: సోమశిల జలాశయం నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు. మంగళవారం ఎగువ ప్రాంతాల నుంచి 702 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందన్నారు. పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా, జలాశయంలో 63.732 TMCల నీటిమట్టం నమోదైంది. పవర్ టన్నెల్ ద్వారా పెన్నా డెల్టాకు 1350 క్యూసెక్కులు, NFCకు 700 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.