కాకినాడలో ఈ రోజు నుంచి హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ టీకా హ్యూమన్ పాపిలోమా వైరస్ సంక్రమణ వల్ల కలిగే గర్భాశయ ముఖ కేన్సర్‌ను నివారించడంలో ఉపయోగపడుతుందిని వైద్యులు తెలిపారు. ఈ పథకం ద్వారా 14 సం. వయస్సు గల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాను అందిస్తున్నారు. వైద్య సిబ్బంది బాలికల తల్లిదండ్రులకు టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.