HYD: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన రౌడీ షీటర్‌కు న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్ష విధించింది. పాతబస్తీ కామాటిపుర PSలో మహ్మద్ రియాజుద్దీన్‌పై రౌడీషీట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో రౌడీషీటర్ రియాజుద్దీన్‌ను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. బైండోవర్ టైంలో రియాజ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు.