RR: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిపోతుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా మహిళా బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ బిల్ ప్రవేశ పెట్టడమనే దుర్మార్గమైన చర్యను ప్రజాశక్తులు అడ్డుకున్నాయన్నారు.