MDCL: మేడ్చల్ సర్కిల్ పరిధిలో మేడ్చల్, సుతారిగూడ, గుండ్లపోచంపల్లి, అత్వెల్లి, పూడూరు, గిర్మాపూర్, రాయిలాపూర్ ప్రాంతాల్లో చెరువులు మురుగుతో నిండిపోతున్నాయి. దీంతో దోమల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాల్లో దుర్వాసన వ్యాపించి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే శుద్ధి చర్యలు చేపట్టి, దోమల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.