HNK: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ పరీక్షలు ఈ నెల 20 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్)తో పాటు 1, 3, 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.