MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన BJP నిరసన ధర్నాలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ BJP నాయకుల చేతుల్లో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చిత్రం కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య స్పందిస్తూ, “దేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైన స్థానం సంపాదించిన ఇందిరమ్మ పేరు, రూపం ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచివున్నాయి.