మలయాళ సినిమాలకు ఓటీటీలో భలే క్రేజ్ ఉంటుంది. ఈ వారం ‘జియో హాట్స్టార్’లో వచ్చిన ‘సంభవం అధ్యాయం ఒన్ను’ ఆకట్టుకోగా, ఏప్రిల్ 24 నుంచి పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతిఛాయ’ స్ట్రీమింగ్ కానుంది. నివిన్ పౌలీ హీరోగా బి. ఉన్నికృష్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రం కేరళ రాజకీయాల నేపథ్యంలో సాగుతుంది. అయితే తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.